@saikrishna muddu
Saikrishna mudduM.s.krishna
దానిమ్మ ప్రపంచ వ్యాప్తంగా గాలిలో తేమ లేని పొడి వాతావరణం గల ప్రదేశాలలో వాణిజ్యపరంగా దానిమ్మ (Pomegranate) సాగవుతోంది. దీనిని "దామిడీ వృక్షమ్" ఆని కూడా అంటారు. భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా దానిమ్మ సాగులో ప్రథమస్థానంలో ఉంది. తెలంగాణా రాష్ట్రంలోని, మహారాష్ట్రలో షోలాపూర్, నాగ్పూర్ జిల్లాలలోని రాష్ట్రంలో కూడా దానిమ్మ సాగు జరుగుచున్నది. మనదేశం నుంచి 4000-5000 టన్నుల దానిమ్మ పండ్లు ఎగుమతి అవుతున్నాయి. దానిమ్మ భారతదేశంలో అత్యంత ఖరీదైన ఫలము.
లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసమప్రభ' అనే నామం కనిపిస్తుంది. దీని శాస్త్రీయ నామము " Punica Granatum". పండ్ల జాతులలో మేలైనది . తినడానికి రుచిగా ఉంటుంది . దీనిలో విటమిను -ఎ,సి, ఇ ,బి5, flavanoids ఉన్నాయి.
దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి . పండులోని " ఇల్లాజిక్ యాసిడ్ " ను చర్మం పై రాస్తే సూర్యకిరణల తాలూకు ప్రభావము నుంచి రక్షింస్తుంది .
ఔషద విలువలు
◾అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్, వక్షోజ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి.
◾దానిమ్మ సహజ యాస్పిరిన్. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.
◾ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం.
◾సహజ ఆస్ప్రినే కాదు... దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. అంగస్తంభన సమస్యలతో బాధపడేవారికి సరైన ఔషధం. సంతాన సాఫల్యతను పెంచే శక్తీ ఉంది దీనికి.
◾గర్భస్థశిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణులు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుందని ఒక అధ్యయనం.
◾వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది.
◾ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు నోటి పూతనుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.
◾రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు విరుగుడు దానిమ్మ రసం. దానిమ్మ రసము అంగసంభాన సమస్యలను నివారిస్తుంది ... శృంగార ప్రేరితంగా పనిచేస్తుంది గుండె (హృదయము) కు మేలు చేస్తుంది . దానిమ్మ రసములోని రసాయనాలు 'కొలెస్టరాల్ ' వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది . రక్తపోటును తగ్గించే గుణము దీనికి ఉంది - inhibit the angiotenson converting enzyme .రక్తనాళాలు ముసుకుపోయే గుణము నుండి రక్షిస్తుంది . ఫ్లవనోయిడ్స్ వలన కాన్సర్ వ్యాధి వచ్చే అవకాసము తగ్గుతుంది . దానిమ్మ గింజల ,నూనె ... రొమ్ము కాన్సర్ అదుపుచేయు లక్షణము కలిగివుంది .
వారానికోసారి దానిమ్మ రసము :
అధికరక్తపోటు తో బాధపడు తున్నా లేక ట్రైగ్లిసరైడ్స్ 100 దాటి వున్నా లేదా గుండెను కాపాడే హెచ్.డి.ఎల్. కొలెస్టిరాల్ 50 కన్నా తక్కువగా ఉన్నా... ప్రతివారము ఒకసారి గ్లాసు దానిమ్మరసము తాగడము మంచిది. . గుండెజబ్బులున్నవారికి మేలు చేస్తుంది . మూత్రపిండాల సమస్యలున్నవారికి బాధలను నివారిస్తుంది. దానిమ్మ రసమ్ జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది [1]. దానిమ్మగింజలు నోటిలో వేసుకుని నమలడము కన్న దాన్ని రసము తీసుకొని తాగడము మేలు ... మంచిది .
దానిమ్మ చెట్టు
◾ముళ్ళతో ఎదిగే పెద్ద పొద లేదా చిన్న వృక్షం.
◾విపరీత అండాకారంలో గురు అగ్రంతో ఉన్న సరళ పత్రాలు.
◾గ్రీవాలలో ఏకాంతంగా గాని, నిశ్చిత సమూహాలుగా గాని అమరిన దట్టమైన ఎరుపురంగు పుష్పాలు.
◾గుండ్రంగా ఉన్న మృదుఫలాలు.
◾కోణయుత విత్తనాలు.
సాగు
దానిమ్మ సాగుకు తేమ లేని పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం, నీరు నిలవని గట్టి గలస నేలలు అవసరం. చుట్టుప్రక్కల చెరువులు గాని, నదులు గాని, వరి పొలాలు గాని ఉన్న దానిమ్మతోటల్లో ఎక్కువ చీడపీడల ప్రభావం ఉంటుంది. దానిమ్మకు సాధారణంగా 2.50 అంగుళాల బోరు నీరు సరిపోతుంది. అందువల్ల దానిమ్మ రైతులు సాధారణంగా నీటి కరవు ఉన్న అటవీ ప్రాంతాలను ఎంచుకుంటారు. అంటు మొక్క నాటిన 18 నెలలకు పుష్పించి ఫలాలు ఇస్తాయి. ఒక్కొక్క దానిమ్మ మొక్క సగటున 2 నుండి 10 లీటర్ల నీరును పీల్చుకుంటుంది. ఎండాకాలంలో ట్యాంకర్లతో నీరు తెప్పించాల్సివుంటుంది. ఎరువులు - కలుపు - పురుగు మందుల యాజమాన్యం సకాలంలో ఉండాలి. చుట్టు ప్రక్కల ఇతర పంటలు ఉన్నా దానిమ్మకు వైరస్ తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువ.
When people think about computer science, they imagine people with pocket protectors and thick glasses who code all night. @saikrishna mud...